ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. కిచ్చా సుదీప్ ఎమోషనల్ నోట్

by Mallepaka Hamsa |

కన్నడ కిచ్చా సుదీప్(Kichcha Sudeep), వెండితెరపై అడుగుపెట్టి మూడు దశాబ్దాలు (30 ఏళ్లు) పూర్తి చేసుకున్నాడు.

ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. కిచ్చా సుదీప్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: కన్నడ కిచ్చా సుదీప్(Kichcha Sudeep), వెండితెరపై అడుగుపెట్టి మూడు దశాబ్దాలు (30 ఏళ్లు) పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, తన జర్నీపై ఎమోషనల్ నోట్‌ను విడుదల చేశాడు. కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, ‘బిగ్‌బాస్’ హోస్ట్‌గా మల్టీ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన సుదీప్, ఇన్నాళ్లు ఆదరించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరించారు. "ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక సామాన్య కుర్రాడిని, ఈ రోజు ఈ స్థాయికి చేర్చింది కేవలం అభిమానుల ప్రేమే" అని సుదీప్ పేర్కొన్నారు.

దర్శకనిర్మాతలు తనపై ఉంచిన నమ్మకం, తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల టీమ్ వర్క్ వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన గుర్తు చేసుకున్నారు. కన్నడ ఇండస్ట్రీ తనకు గుర్తింపునిచ్చిందని, ఇక్కడి మూలాలే తనను నిలబెట్టాయని చెబుతూ.. తెర వెనుక పనిచేసే ప్రతి ఒక్క లైట్ బాయ్ నుండి టెక్నీషియన్ వరకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. సినీ ప్రపంచంలో ఎన్నో కలలతో అడుగుపెట్టిన తాను ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' సినిమాతో టాలీవుడ్‌లోనూ చెరగని ముద్ర వేసిన ఆయన, ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 30 ఏళ్ల ప్రయాణం తనకు నేర్పిన వినయాన్ని ఆయుధంగా చేసుకుని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న చిత్రాలతో అలరిస్తానని సుదీప్ మాటిచ్చారు.

Next Story