ఆమె ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు.. కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

తన కూతురు సినిమాల్లోకి వస్తుందని అస్సలు ఊహించలేదని, ఆమెకు నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని ఆయన తెలిపారు.

ఆమె ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు.. కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ తన కుమార్తె, నటి కళ్యాణి ప్రియదర్శన్ సినీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కూతురు సినిమాల్లోకి వస్తుందని అస్సలు ఊహించలేదని, ఆమెకు నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని ఆయన తెలిపారు. కళ్యాణి ఆర్కిటెక్చర్ చదివిందని, తన భవిష్యత్తును అదే రంగంలో చూసుకోవాలనుకుందని ప్రియదర్శన్ పేర్కొన్నారు. అయితే, అక్కినేని నాగార్జున ఫోన్ కాల్‌తో కళ్యాణి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తన సినిమాలో హీరోయిన్‌గా కళ్యాణిని తీసుకోవాలనుకుంటున్నట్లు నాగార్జున అడిగారని, కానీ ఆమెకు అస్సలు నటించడం రాదని తాను వారించినా ఆయన వినలేదని ప్రియదర్శన్ వెల్లడించారు.

చివరకు కళ్యాణి కూడా ఒకసారి ప్రయత్నించి చూస్తానని, సినిమాలు సెట్ కాకపోతే మళ్లీ తన ఆర్కిటెక్చర్ వృత్తిలోకి వెళ్లిపోతానని చెప్పి వెండితెరకు పరిచయమైందని ఆయన వివరించారు. ప్రస్తుతం కళ్యాణి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదగడం పట్ల తండ్రిగా ఆయన ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ, ఇంట్లో తాము వృత్తిపరమైన విషయాలను చర్చించుకోమని ప్రియదర్శన్ స్పష్టం చేశారు. తను చేస్తున్న ప్రాజెక్టుల గురించి కళ్యాణి ఆయనతో చర్చించదని, అలాగే తను కూడా తన సినిమాల గురించి ఆమెతో మాట్లాడనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నటనపై ఇంట్రెస్ట్ లేకపోయినా అద్భుతంగా నటిస్తుందని తండ్రి తగ్గ తనయ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ ‘లోకా: చాప్టర్1’ సీక్వెల్ చేస్తోంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అయితే ఇందులో దుల్కర్ ఓ కీలక పాత్రలోనూ కనిపించనున్నట్లు సమాచారం. అలాగే టోవినో థామస్ కూడా నటిస్తున్నారు.

Next Story