- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ₹200 కోట్ల హిట్ కోసమే ఆ తప్పు చేశాను.. భూమి పెడ్నేకర్ సంచలన వ్యాఖ్యలు!
కొన్నిసార్లు ఆ ₹200 కోట్ల భారీ కమర్షియల్ హిట్ అందుకోవాలనే ఆశ కలిగింది. ఆ ఆశతోనే అతిపెద్ద తప్పు చేశా.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar)తన సినీ ప్రయాణంలో తాను చేసిన పొరపాట్ల గురించి చాలా ధైర్యంగా, నిజాయితీగా స్పందించారు. దమ్ లగా కే హైషా, సాండ్ కీ ఆంఖ్, బధాయి దో వంటి చిత్రాలతో నటనకు ప్రాధాన్యత ఉన్న నటిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా, జరిగిన 'వి ది ఉమెన్'(We the Women) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కెరీర్ తొలినాళ్లలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఏదైనా పొరపాటు జరిగిందా అని అడిగినప్పుడు.. ‘‘అవును, నేను కొన్ని తప్పులు చేశాను. నా కెరీర్ మొత్తం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల మీదనే నిర్మించుకున్నాను. కానీ, మధ్యలో కొన్నిసార్లు ఆ ₹200 కోట్ల భారీ కమర్షియల్ హిట్ అందుకోవాలనే ఆశ కలిగింది. ఆ ఆశతోనే నా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేని సినిమాల్లో నటించాను. అది నేను చేసిన అతిపెద్ద తప్పు’’ అని ఆమె బహిరంగంగా అంగీకరించారు.
సినిమా ఫలితం ఎలా ఉన్నా, కొన్ని విషయాల్లో మాత్రం తాను అస్సలు రాజీ పడనని భూమి స్పష్టం చేశారు. ‘‘స్త్రీలను తక్కువ చేసి చూపే లేదా నా జెండర్‌ను అవమానించే పాత్రలు నేను ఎప్పటికీ చేయను. ఒకవేళ ఆ సినిమాలో నాకు చేసేందుకు పెద్దగా పని లేకపోయినా నాకు నచ్చదు. ఎందుకంటే ప్రేక్షకులు నా నుండి ఒక బలమైన నటనను ఆశిస్తారు. కష్టపడి సంపాదించుకున్న ఆ గుర్తింపును పక్కన పెట్టి మళ్ళీ అలాంటి తప్పులు చేయను’’ అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం భూమి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కమర్షియల్ సక్సెస్ కోసం తనలోని నటిని చంపుకోనని, ఇకపై అర్థవంతమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని ఆమె చెప్పడంపై ప్రశంసలు దక్కుతున్నాయి.






