- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా విషయంలో నేను తప్పు చేశాను నన్ను క్షమించండి.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స(Mohan Srivatsa) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’(tribanadhari barbarik).

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స(Mohan Srivatsa) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’(tribanadhari barbarik). సత్యరాజ్(Sathyaraj), ఉధయ భాను, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ అయింది. ఈక్రమంలోనే డైరెక్టర్ తన సినిమాను చూడటానికి ఎవరై థియేటర్స్‌కు రావడం లేదని కన్నీరు పెట్టుకున్న వీడియోను రిలీజ్ చేశారు. తన చెప్పుతోనే తాను కొట్టుకోవడంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండనంటూ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ తాను చెప్పుతో కొట్టుకుని అంతలా బాధపడటానికి కారణాలున్నాయని కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘నేను ఏడుస్తున్న వీడియో రిలీజ్ చేశాక నా మూవీ టీమ్ అంతా నన్ను కలిశారు. విదేశాల్లో ఉన్నవారు కూడా నాకు మెసేజ్‌లు పెట్టారు. బాగుంది బాలేదని చెప్పడం వల్లే అలా ఏడవాల్సి వచ్చింది. భావోద్వేగానికి గురై ప్రేక్షకులను, నా కుటుంబాన్ని బాధపెడుతున్నాను. మలయాళ చిత్రానికి దక్కిన ఆదరణ నా సినిమాకు దక్కకపోయేసరికి తట్టుకోలేకపోయా అందుకే బాధపడ్డాను. ఆడియన్స్‌కు నా సినిమా నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ ఈ చిత్రం విషయంలో తప్పు నాదే. పబ్లిసిటీ సరిగ్గా చేయలేకపోయాము.
డబ్బులు పెట్టాము కానీ జనాల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయాము. ఇంతమంది చెప్పాక కూడా నా తప్పు నేను తెలుసుకోకపోతే బాగోదు. చాలా మంది ఈ సినిమా కూడా తెలియదు అన్నారు. నేను ఈ విషయంలో ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతున్నాను. వారికి రీచ్ అవకుండానే నేనేదో బాధపడి ఏడ్చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. ఇదంతా అయ్యాక చూసిన జనాలు మెచ్చుకుంటున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.






