- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సంఘటనతో ఎన్నో కోల్పోయా.. జీవితంపై ఆశయాలు వదులుకున్నానంటూ మెగా హీరో ఎమోషనల్ కామెంట్స్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘సంబరాల ఏటిగట్టు’(sabharala yetigattu) సినిమాతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘సంబరాల ఏటిగట్టు’(sabharala yetigattu) సినిమాతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలాగే పలు ఈవెంట్లలో పాల్గొంటూ తన అనుభవాలను అభిమానులకు తెలియజేస్తున్నాడు. తాజాగా, సియా ధరమ్ తేజ్ ‘ట్రాఫిక్ సమ్మిట్-2025’ కార్యక్రమంలో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. గతంలో తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని వివరించాడు. ‘‘నాకు 2021లో యాక్సిడెంట్ అయింది. రెండు వారాలు కోమాలోనే ఉన్నాను. తలకు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బతికిపోయాను.
అందుకే బండి నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. యాక్సిడెంట్ తర్వాత నా వాయిస్ పోయింది. అలాగే నేను చాలా విషయాలు మర్చిపోయాను. జీవితంపై ఆశను వదులుకున్నాను.ఇక అప్పటి నుంచి బైక్ నడపాలంటేనే భయపడుతున్నాను. దీంతో ఒకరోజు మా అమ్మ నాకో విషయం చెప్పింది. నువ్వు ఇంటి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో బైక్‌ను నడిపి ధైర్యం వచ్చిన తర్వాతే రోడ్డు పైకి వెళ్లు అని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే చేస్తున్నాను. అది కూడా హెల్మెట్ పెట్టుకుని మాత్రమే’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






