- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలాంటి సమయంలోనైనా ప్రశాంతంగా ఉండటాన్ని ఆయన ద్వారానే నేర్చుకున్నాను: సాయి పల్లవి
పుట్టపర్తిలోని ఈ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

దిశ, సినిమా: పుట్టపర్తిలోని ఈ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని అలంకరిస్తున్నారు. ఈ వేడుకలు హిల్ వ్యూ స్టేడియంలో స్వర్ణ రథంపై సత్యాసాయి చిత్ర పటాన్ని ఊరేగింపును సత్యసాయి ట్రస్ట్ నిర్వహించనుంది. ఈ క్రమంలో.. తాజాగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మా అమ్మ తాతయ్య సాయి బాబాకు భక్తులు. అంతేకాకుండా మా అమ్మ, అత్తమ్మ, మావయ్య అందరూ సాయి బాబాకు చెందిన యూనివర్సిటీలో చదివారు. అందుకే నన్ను చిన్నప్పటి నుంచి అక్కడికి తీసుకెళ్లేవారు. పుట్టపర్తి సాయిబాబా స్వామి పేరు కలిసేలా ఉండాలని నాకు పెట్టారు.
14, 15 ఏళ్ల తర్వాత నా పేరు నాకు నచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉందనిపించింది. అప్పటి నుంచి నేను కూడా సాయిబాబాకు భక్తురాలిగా మారిపోయాను. సత్యసాయి భోధనలే నాలో ధైర్యాన్ని నింపాయి. అలాగే ఎలాంటి సమయంలోనూ ప్రశాంతంగా, ఒత్తిడిని అధిగమించడం, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన ద్వారానే నేర్చుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘రామాయణ’ టైటిల్‌తో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఇందులో సీత పాత్రలో కనిపించనుండగా.. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. యశ్ రావణాసురుడిగా కనిపించనుండగా.. సుమారు రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2026, 2027 సంవత్సరాల్లో దీపావళికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. నితేష్ తివారి తెరకెక్కించిన చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది.






