ఇండస్ట్రీలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాను.. త్రిష ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇండస్ట్రీలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాను.. త్రిష ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) ‘విశ్వంభర’(Vishvambhara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ (Chiranjeevi), వశిష్ట కాంబోలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శకవేగంగా జరుగుతోంది. సోసియో-ఫాంటసీ కథతో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ (SIIMA) 2025 వేడుకలకు త్రిష హాజరైంది. దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. 2024 సంవత్సరంలో తమ సత్తా సాటిన నటీనటులు, మూవీ యూనిట్స్‌కు ఈ అవార్డులు ప్రకటించారు. ఇక ఇందులో అవార్డు సొంతం చేసుకున్న త్రిష మాట్లాడుతూ.. ‘‘2012 నుంచి నేను సైమాకు హాజరవుతున్నాను. ఇది నిజంగా చాలా అభివృద్ధి చెందింది.

మాకు ఇంట్లో ఉన్నట్లు అనిపించేలా చేస్తారు. నాలుగు పరిశ్రమలకు సంబంధించిన సెలబ్రిటీలు కలుసుకునే సైమా వేడుకలు అంటే నాకు చాలా ఇష్టం. తరచుగా తమిళ అవార్డులు ఇస్తారు.. కానీ సైమా అవార్డ్సులోనే ప్రతి ఒక్కరినీ చూడొచ్చు. ఇది చాలా ప్రత్యేకమైనది.. ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు మాకు అందిస్తుంది. నా ప్రయాణంలో భాగమైన నా దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను చేసిన కొన్ని చిత్రాల గురించి నేను చాలా గర్వపడుతున్నాను. కొన్ని సినిమాలు గొప్ప పాఠాలు నేర్పించాయి. నేను నిజమైన ప్రేమను పొందాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఇంకా బాగా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎల్లప్పుడూ నా వెనకాలే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు నా ప్రియమైన శ్రేయోభిలాషులు, అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Next Story