- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను చావలేదు.. ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను.. మరణవార్తలపై శక్తి కపూర్ మాస్ వార్నింగ్
నేను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మరణం గురించి వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం. దయచేసి ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మకండి" అని ఆయన ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు, శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ మరణించారంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో ఆయన అభిమానులు, చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లేనని స్వయంగా శక్తి కపూర్ స్పష్టం చేశారు. తన మరణంపై వస్తున్న తప్పుడు వార్తలు మరీ ఎక్కువగా ప్రచారమవుతుండటంతో శక్తి కపూర్ స్వయంగా ఒక వీడియోను విడుదల చేశారు. "నేను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మరణం గురించి వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం. దయచేసి ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మకండి" అని ఆయన ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు.
కేవలం ఖండించడమే కాకుండా, ఇలాంటి ‘డెత్ హోక్స్’ (మరణ వార్తల పుకార్లు) సృష్టించే వారిపై శక్తి కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, కుటుంబ సభ్యులను, అభిమానులను ఆందోళనకు గురిచేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. దాదాపు 700 చిత్రాల్లో విలన్‌గా, కమెడియన్‌గా తనదైన ముద్ర వేసిన శక్తి కపూర్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు కేవలం వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం శక్తి కపూర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






