నేను ప్రేమకు సరెండర్ అయ్యాను.. రెజీనా వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ అయిన ఫ్యాన్స్!

by Mallepaka Hamsa |

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. అయితే చాలామంది ప్రేమను ఒక బలహీనతగా భావిస్తారు.

నేను ప్రేమకు సరెండర్ అయ్యాను.. రెజీనా వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ అయిన ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: నటి రెజీనా కసాండ్ర.. వెండితెరపై తన చిరునవ్వుతో, చురుకైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అచ్చ తమిళ అమ్మాయి. 2005లో ‘కండనాళ్ మొదల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ భామ, తెలుగులో ‘ఎస్.ఎమ్.ఎస్’ (SMS) సినిమాతో యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నేటి తరం నటీమణుల్లో కెరీర్ పట్ల, జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న అతి కొద్దిమందిలో రెజీనా ఒకరు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రెజీనా, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోప్రేమ గురించి ఎంతో లోతైన విషయాలను పంచుకున్నారు. ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

‘‘ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. అయితే చాలామంది ప్రేమను ఒక బలహీనతగా భావిస్తారు. కానీ నా దృష్టిలో ప్రేమ అనేది ప్రశాంతతతో కూడిన ఒక గొప్ప బలం. మనం ప్రతిరోజూ చిరునవ్వుతో నిలబడటానికి ప్రేమ ఒక శక్తిని ఇస్తుంది. నేను కూడా ఒక రోజు ప్రేమకు పూర్తిగా సరెండర్ అయ్యాను’’ అని రెజీనా పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రేమ విలువ గురించి చెబుతూ.. ‘‘మనం ప్రేమను పంచడానికి, పొందడానికి అర్హులమనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. దానిని ఏమాత్రం తక్కువగా చూడకండి. అసలు మనం ప్రేమలో ఉన్నప్పుడు పొందే ఆనందం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా? ఆ ప్రేమను కోల్పోతే కలిగే బాధ ఏంటో మనకు ముందే తెలిసి ఉండటమే! ఆ బాధే ప్రేమ విలువను మనకు గుర్తుచేస్తూ ఉంటుంది’’ అని ఎంతో ఫిలాసఫికల్‌గా వివరించారు.

రెజీనా ఇంత ఎమోషనల్‌గా ప్రేమ గురించి మాట్లాడటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదంతా మీ స్వానుభవమా రెజీనా? మళ్ళీ ప్రేమలో పడ్డారా? లేక గతంలో జరిగిన చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠమా? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మాటల్లోని పరిణతి చూస్తుంటే, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఈ స్థాయికి చేరుకున్నారని అర్థమవుతోంది. కెరీర్ పరంగా రెజీనా ఇప్పుడు గోల్డెన్ ఫేజ్ లో ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ఫ్లాష్‌బ్యాక్’, ‘ముక్కుత్తి అమ్మన్-2’ వంటి చిత్రాలతో పాటు, హిందీలో ‘ది వైన్స్’, ‘సెక్షన్ 108’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story