ఇలాంటి జానర్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు.. నాకు ఇది చాలెంజింగ్ ఫిలిం: అల్లరి నరేష్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-18 14:34:54  IST  )

హీరో అల్లరి నరేష్ (Allari Naresh)అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’(12A Railway Colony). ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేస్తోంది.

ఇలాంటి జానర్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు.. నాకు ఇది చాలెంజింగ్ ఫిలిం: అల్లరి నరేష్
X

దిశ, సినిమా: హీరో అల్లరి నరేష్ (Allari Naresh)అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’(12A Railway Colony). ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు నాని కాసరగడ్డ(Nani Kasaragadda) దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇందులో పాల్గొన్న అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే టాక్ ఏంటి, ఓపెనింగ్స్ ఏమిటి ? ఎలాంటి రివ్యూస్ వస్తాయనే టెన్షన్‌గా ఉంటుంది. కానీ నాని ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. తనకి ఎక్కడ టెన్షన్ లేదు ఇంత కాన్ఫిడెన్స్‌గా ఉండడానికి కారణం మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంత స్ట్రాంగ్‌గా ఉంది. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వారిని ఎవరు ఆపలేరు. నేను 35 మంది కొత్త డైరెక్టర్స్‌తో పని చేశాను. దాంట్లో చాలా మంది సక్సెస్ అయ్యారు. కొంతమంది అవ్వలేదు.

నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంటున్నాను. భీమ్స్ గారికి నాకు ఇది చాలెంజింగ్ ఫిలిం. ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఇది చూసిన తర్వాత నా గురించి కంటే భీమ్స్ గురించి ఎక్కువ రాస్తారు. ఈ మూవీకి పనిచేసిన అందరూ కూడా సిన్సియర్‌గా కష్టపడ్డారు. ‘నా సామి రంగ’ చేసినప్పుడు నా కాలికి దెబ్బ తగిలింది. చిట్టూరి గారు సెంటిమెంట్ అన్నారు. నిజంగా ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ‘12ఎ రైల్వే కాలనీ’ చేసినప్పుడు కూడా నా భుజానికి గాయమైంది. తప్పకుండా ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నా. ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Next Story