చేదు అనుభవాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది: ప్రశాంత్ వర్మ

by Mallepaka Hamsa |

‘హనుమాన్’ (Hanuman)సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రశాంత్ వర్మ (Prashanth Verma)ఒకరు.

చేదు అనుభవాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది: ప్రశాంత్ వర్మ
X

దిశ, సినిమా: ‘హనుమాన్’ (Hanuman)సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ (Prashanth Verma). కంటెంట్, విజువల్స్, ప్రమోషన్ మూడు కోణాల్లోనూ ఆయన పని చేసిన తీరుకు ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయనతో చేయాలని పెద్ద హీరోల నుంచి కొత్త ప్రొడక్షన్ హౌస్‌ల వరకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘హనుమాన్’ సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు. ‘జై హనుమాన్’ పేరుతో రాబోతుండగా.. ఇందులో హనుమాన్ పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన, రిషబ్ ఫస్ట్ లుక్ తప్ప మరేలాంటి అప్డేట్ రాలేదు.

ఈక్రమంలోనే ప్రశాంత్ వర్మ మరో ప్రాజెక్ట్ ‘మహాకాళి’ మూవీతో రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్ట్స్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా? అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో గోవాలో జరిగిన IFFI వేడుకల్లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో నిర్మాతలకే రిలీజ్ డేట్స్‌పై పూర్తి కంట్లోల్ లేకపోవడంతో ఇక నుంచి తన సినిమాల విడుదల తేదీపై తానే నిర్ణయం తీసుకునే షరతును ఒప్పందాల్లో పెట్టుకుంటానని స్పష్టం చేశారు.

ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ చిత్రాలకు సమయం కీలకమైందని, కావాల్సిన సమయం ఇస్తేనే క్వాలిటీగా అవుట్‌పుట్ వస్తుందని తెలిపారు. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదురైన సమస్యలు, చివరి నిమిషంలో వచ్చిన రిలీజ్ ఒత్తిళ్లే కారణం అని అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ప్రశాంత్ వర్మకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల తన విజన్‌ని 100శాతం ప్రేక్షకులకు అందించే అవకాశం పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొత్త ట్రెండ్‌కు ప్రశాంత్ వర్మ శ్రీకారం చుట్టేస్తారని అంటున్నారు.

Next Story