ఫిదాలో సాయిపల్లవికి అక్కగా నటించే ఛాన్స్ నాకే వచ్చింది: నటి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 9 |
ఫిదాలో సాయిపల్లవికి అక్కగా నటించే ఛాన్స్ నాకే వచ్చింది: నటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మొదట్లో బుల్లితెరపై అలరించి.. తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ల ఫ్రెండ్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి హరితేజ. ఈనెల (అక్టోబరు) 6వ తేదీన ప్రేక్షకులను ముందుకు రాబోతున్న ‘మామా మశ్చీంద్ర’ చిత్రంలో హరితేజ కీలక రోల్‌లో మెరవనుంది. ఈ సందర్భంగా హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేఖర్ కమ్ముల అతిథిగా హాజరయ్యారు. ఈయన్ని చూసిన హరితేజ.. ‘‘మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది. నేను మూవీస్‌కు పెద్ద అభిమానిని. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్‌కు పిలిచారు. నాకు మీ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. దీంతో మూడు సార్లు ఆడిషన్‌కు వచ్చాను. కానీ రిజెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలంగాణ యాస రాదు. ఈ మూవీ చూశాక తెలంగాణ యాస నేర్చుకున్నాను.’’ అంటూ హరితేజ చెప్పుకొచ్చింది.

Read More: Ram Charan : వినాయకుని సన్నిధిలో అయ్యప్ప దీక్ష విరమించిన రామ్ చరణ్

Next Story

Most Viewed