- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శర్వానంద్ ‘బైకర్’ సినిమా అనవసరంగా చేశా అని చాలా ఫీల్ అయ్యా.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక కుర్రాడు వచ్చి నన్ను తాతయ్య అని పిలవగానే ఒక్కసారిగా షాకయ్యాను. చాలా ఫీల్ అయ్యాను కూడా.

దిశ, సినిమా: సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా శర్వానంద్ హీరోగా, అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వచ్చిన ‘బైకర్’ సినిమాలో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో.. తాజాగా, చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. సక్సెస్ మీట్‌లో రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తను నటించడం వెనుక ఉన్న కారణాన్ని బయటపెట్టారు. "సాధారణంగా నన్ను మా ఇంట్లో అక్కావాళ్ల పిల్లలు కూడా 'తాత' అని పిలవరు.. అందరూ డాక్టర్ మామయ్య అనే అంటారు. నాకు తాత అని పిలిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక కుర్రాడు వచ్చి నన్ను తాతయ్య అని పిలవగానే ఒక్కసారిగా షాకయ్యాను. చాలా ఫీల్ అయ్యాను కూడా. అనవసరంగా ఈ మూవీ ఒప్పుకున్నానా? అని కూడా అనిపించింది.
కానీ ఇప్పుడు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆ బాధ అంతా పోయింది" అని నవ్వుతూ చెప్పారు. శర్వానంద్ గురించి చెబుతూ.. "షూటింగ్ సమయంలో శర్వా నన్ను తన సొంత తండ్రిలాగే చూసుకున్నాడు. ఎంతగా అంటే.. ఇందాకే మా అమ్మాయిలతో గొడవపడి, నేను నా కొడుకు (శర్వానంద్) దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించాను" అని తన బాండింగ్‌ను వివరించారు. శర్వానంద్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటారని, ఈ సినిమాలో నటించడం తన కెరీర్‌కు కచ్చితంగా ప్లస్ అవుతుందని రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ 'బైకర్' చిత్రం రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి ఊపునిచ్చేలా కనిపిస్తోంది.






