నాకు మొదటి రాష్ట్ర అవార్డు వచ్చిన సమయంలో ఆయన లేరనే బాధ ఎక్కువగా ఉంది: కీర్తి సురేష్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-14 05:07:19  IST  )

ఈరోజు మనోబాల సార్ మా మధ్య లేకపోవడం నన్ను ఎంతగానో బాధిస్తోంది.

నాకు మొదటి రాష్ట్ర అవార్డు వచ్చిన సమయంలో ఆయన లేరనే బాధ ఎక్కువగా ఉంది: కీర్తి సురేష్
X

దిశ, సినిమా: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 2016 నుండి 2022 సంవత్సరాలకు గాను తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక 2026 ఫిబ్రవరి 13న చెన్నైలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ జాబితాలో స్టార్ హీరోలు ధనుష్ (వడ చెన్నై), సూర్య (సూరరై పొట్రు), విజయ్ సేతుపతి, కార్తీ ఉత్తమ నటులుగా అవార్డులు అందుకోగా.. నయనతార, జ్యోతికలతో పాటు మన మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)కూడా ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకుంది.

కీర్తి సురేష్ ఎమోషనల్ పోస్ట్:

‘పాంబు సట్టై’ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్ ఈ అవార్డు రావడంపై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నాకు మొదటి రాష్ట్ర అవార్డు ఇచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నా తొలి తమిళ చిత్రం నుంచి నన్ను ఆదరిస్తున్న రాధికా మ్యామ్, శరత్ కుమార్ సార్‌లకు ధన్యవాదాలు. కానీ, ఈరోజు మనోబాల సార్ మా మధ్య లేకపోవడం నన్ను ఎంతగానో బాధిస్తోంది. ఆయన ఇక్కడ ఉంటే ఈ ఆనందం మరోలా ఉండేది’’ అంటూ కీర్తి ఆవేదన వ్యక్తం చేసింది. మనోబాల మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో కలచివేసిందని ఆమె తన పోస్ట్‌లో చెప్పింది.

వరుస ఆఫర్లతో బిజీ:

ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఆమె క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్ధన్’ అనే మాస్ ఎంటర్టైనర్‌లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో మాన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రాబోతుంది.

ఉల్లిపొరలాంటి శారీలో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న రుక్మిణి వసంత్..!

Next Story