నేను సమంతతో ప్రేమలో పడిపోయా: విజయ్ దేవరకొండ

by Disha Web Desk 6 |
నేను సమంతతో ప్రేమలో పడిపోయా: విజయ్ దేవరకొండ
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. సమంత మొదటి పాన్ ఇండియా సినిమా 'యశోద'. ఇది నవంబర్ 11న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అయిన పోస్టర్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే 'యశోద' సినిమా ట్రైలర్లను ఒక్కో భాషలో ఒక్కో హీరోతో రిలీజ్ చేయించారు. తెలుగులో ట్రైలర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గురువారం చిత్రబృందం విడుదల చేయించింది. అయితే సమంతపై విజయ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ''నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సమంతని మొట్టమొదటిసారి స్క్రీన్ మీద చూశాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను. తను సాధించిన వాటిని చూసి నేను ఇప్పటికీ సమంతను ఆరాధిస్తాను'' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ చేసిన ట్వీట్ చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత, విజయ్ దేవరకొండ కలిసి ప్రస్తుతం 'ఖుషి' సినిమా చేస్తున్నారు.



Next Story

Most Viewed