- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగు నెలల పాటు నరకం అనుభవించాను.. అనారోగ్య సమస్యలపై మమ్ముట్టి ఎమోషనల్ కామెంట్స్
ఆ సమయంలో కలిగిన ఆందోళన అంతా ఇంతా కాదు నరకం అనుభవించాను

దిశ, సినిమా: మలయాళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్న మమ్ముట్టి(Mammootty), గతేడాది జూన్ నెలలో తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చారు. తాజాగా కోలుకున్న తర్వాత షూటింగ్స్‌లో బిజీ అయిన మెగాస్టార్, తన అనారోగ్య సమస్యల గురించి స్పందిస్తూ.. మన శరీరంలోని జ్ఞానేంద్రియాల విలువను గుర్తు చేశారు. ‘‘మనుషులకు కంటిచూపు, వినికిడి ఎంత ముఖ్యమో.. శ్వాస తీసుకున్నప్పుడు వాసనను గుర్తించడం, ఆహారం తిన్నప్పుడు రుచిని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. నేను నాలుగు నెలల పాటు రుచిని, వాసనను పూర్తిగా కోల్పోయాను. ఆ సమయంలో కలిగిన ఆందోళన అంతా ఇంతా కాదు నరకం అనుభవించాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆ సామర్థ్యాలను తిరిగి పొందుతున్నాను. సాధారణంగా మనం వినడం, చూడటం వంటి విషయాలను చాలా తేలికగా తీసుకుంటాం. కానీ, ఆ శక్తి లేని వారి పరిస్థితి చూసినప్పుడు, వినగలగడం కూడా ఒక గొప్ప వరం అని అర్థమవుతుంది’’ అంటూ మమ్ముట్టి ఎమోషనల్ అయ్యారు.
ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఈ చిన్న చిన్న విషయాల ప్రాధాన్యతను గుర్తించమని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యం నుండి కోలుకున్న మమ్ముట్టి, ఇప్పుడు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మహేష్ నారాయణ్(Mahesh Narayan) దర్శకత్వంలో రాబోతున్న ‘పేట్రియాట్’ (Patriot)మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, మలయాళ ఇండస్ట్రీలోని ఇద్దరు లెజెండరీ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ చాలా కాలం తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటం. అంతేకాకుండా, ఇందులో వెర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం మమ్ముట్టి పూర్తి ఆరోగ్యంతో సెట్స్‌లో పాల్గొంటున్నారు. తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.






