వార్తల్లో ఉండటం కంటే పనిలో ఉండటమే ఇష్టం.. శోభిత సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-16 07:09:09  IST  )

ఎవరి దారి వారిది, కొందరికి పిఆర్ టీమ్ బాగానే పని చేస్తుంది.

వార్తల్లో ఉండటం కంటే పనిలో ఉండటమే ఇష్టం.. శోభిత సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ (Shobitha Dhulipala)ఇటీవల ‘చీకటిలో’ (cheekatilo)సినిమాతో ప్రేక్షకులను అలరించింది. 2018లో వచ్చిన ‘గూఢచారి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శోభిత, ఈ మధ్యలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినా, మళ్ళీ తన మాతృభాషలో నటించడం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఆమె ఒక పాడ్‌కాస్టర్‌గా నటించగా, తెలుగులో క్లిష్టమైన పదాలను కూడా ఎంతో ఈజీగా పలకగలిగానని, భాష మీద పట్టు ఉండటం వల్ల ఆ షూటింగ్ అనుభవం చాలా సరదాగా సాగిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటీనటుల గురించి నిరంతరం సోషల్ మీడియాలో చర్చ జరిగేలా చేసే పిఆర్ (PR) కల్చర్ గురించి శోభిత స్పందించింది.

‘‘గతంలో అక్కడక్కడా కొంతమంది పిఆర్ ఏజెన్సీలతో పనిచేశాను కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతి సెట్ కాదని అర్థమైంది. అందుకే ఇప్పుడు నేను ఏ పిఆర్ టీమ్‌తోనూ పని చేయడం లేదు’’ అని ఆమె స్పష్టం చేసింది. ఎప్పుడూ వార్తల్లో ఉండాలని, 24 గంటలూ తన గురించే అందరూ మాట్లాడుకోవాలని తాను కోరుకోవడం లేదని, ఆ హడావుడి తనకు అస్సలు నచ్చదని ఆమె తేల్చి చెప్పింది. చాలామంది హీరోయిన్స్ నిత్యం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తుంటే.. శోభిత మాత్రం అలాంటివి తనకు అస్సలు నచ్చదని చెప్పడం గమనార్హం. మితిమీరిన పీఆర్ వల్ల నటుల సహజత్వం పోతుందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ఎవరి దారి వారిది, కొందరికి అది బాగానే పని చేయొచ్చు. కానీ వైజాగ్ నుంచి వచ్చి, ముంబైలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన నాకు, ఏది కావాలో ఏది వద్దో అనే విషయంలో మంచి క్లారిటీ ఉంది’’ అని చెప్పింది. ఇతరుల గురించి తనకు తెలియదని, తన వరకు మాత్రం ఇలా ప్రశాంతంగా ఉండటమే ఇష్టమని శోభిత పేర్కొంది.

Next Story