అందమైన బొమ్మలా ఉండటం నాకు ఇష్టం లేదు.. శోభిత కామెంట్స్ ఆ హీరోయిన్లను ఉద్దేశించేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-12 11:43:29  IST  )

ఓ ఇంటర్వ్యూలో శోభిత హాట్ కామెంట్స్ చేసింది. చిత్రాల్లో కేవలం అలా వచ్చి పోయే అందమైన బొమ్మలా ఉండటం తనకు ఇష్టం లేదని చెప్పింది. పాత్ర మంచిదైనా, చెడ్డదైనా.. కథను మలుపు తిప్పేలా ఉండాలని వ్యాఖ్యానించింది.

అందమైన బొమ్మలా ఉండటం నాకు ఇష్టం లేదు.. శోభిత కామెంట్స్ ఆ హీరోయిన్లను ఉద్దేశించేనా?
X

దిశ, సినిమా: నాగచైతన్య(Naga Chaitanya)తో పెళ్లి తర్వాత దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శోభిత(Shobhita Dhulipala) మళ్లీ ‘చికటిలో’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ.. జనాలను మెప్పిస్తోంది. ఈక్రమంలో.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న శోభిత ఆసక్తికర విషయాలు పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులపై మాట్లాడుతూ.. అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్నంత మాత్రాన తన కెరీర్‌ మారిపోలేదని శోభితా ధూళిపాళ స్పష్టం చేశారు. నాకు పెళ్లయి ఏడాది అవుతోంది, కానీ నా కెరీర్‌లో నేను సాధించినవన్నీ నా కష్టంతో వచ్చినవే. ఒక పెద్ద సినీ కుటుంబంలో కోడలిగా ఉన్నప్పటికీ, నా పనిని, నా ఫ్యామిలీని నేను ఎప్పుడూ కలపను అని చెప్పింది.

ఇంట్లో ఉన్నప్పుడు మా అత్తమామలను కేవలం కుటుంబ సభ్యులుగా మాత్రమే చూస్తాను కానీ, ఇండస్ట్రీ మనుషులుగా కాదని. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు కానీ, ప్రస్తుతానికి మాత్రం నా కెరీర్ నిర్ణయాలు నావే" అని తెలిపింది. ఇక సినిమాల ఎంపిక విషయంలో కూడా శోభిత తన రూటు మార్చుకున్నట్లు వెల్లడించింది. ‘‘చిత్రాల్లో కేవలం అలా వచ్చి పోయే అందమైన బొమ్మలా ఉండటం నాకు ఇష్టం లేదు. పాత్ర మంచిదైనా, చెడ్డదైనా.. కథను మలుపు తిప్పేలా ఉండాలి. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన తర్వాత నాకు నా కెరీర్ మీద మరింత క్లారిటీ వచ్చింది. ఎవరి సపోర్ట్ లేకుండా ఆడిషన్స్ ఇచ్చి ఈ స్థాయికి వచ్చానని, ఒక పెద్ద ఫ్యామిలీతో బంధం ఏర్పడినంత మాత్రాన తన ఆలోచనలు మారవని’’ అని శోభిత తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఇవి శోభిత.. గ్లామర్ పాత్రలు చేస్తున్న హీరోయిన్ల గురించి చేసిందని అభిప్రాయపడుతున్నారు.

Next Story