నా వల్ల వారి బంధం ఇబ్బందికరంగా మారకూడదని అనుకున్నా.. అల్లు శిరీష్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

2023 అక్టోబర్‌లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల్లో మా పరిచయం మొదలైంది.. ఆ సమయంలో ఏర్పాటు చేసిన పార్టీలో మేము కలుసుకున్నాం.

నా వల్ల వారి బంధం ఇబ్బందికరంగా మారకూడదని అనుకున్నా.. అల్లు శిరీష్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీలో శుభకార్యం అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నయనిక రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 6న జరిగిన ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా సాగింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రేమ ఎలా మొదలైంది.. పెళ్లికి ముందు తన అన్న అల్లు అర్జున్ ఇచ్చిన సలహా తనకు ఎలా ఉపయోగపడిందో అని వివరించారు. ‘‘2023 అక్టోబర్‌లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల్లో మా పరిచయం మొదలైంది.. ఆ సమయంలో ఏర్పాటు చేసిన పార్టీలో మేము కలుసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం.. ఫ్రెండ్స్ అయ్యాం. తెలియకుండానే ప్రేమ పడిపోయాం. అయితే నయనిక సోదరి మా వదిన స్నేహ మంచి ఫ్రెండ్స్. నా వల్ల వారి బంధం ఇబ్బందికరంగా మారకూడదని అనుకున్నాను.

అయితే, నేను నటుడిని కావడంతో నయనిక మొదట్లో కొంచెం సందేహించినా, నితిన్ భార్య శాలిని (నయనిక బెస్ట్ ఫ్రెండ్) శిరీష్ మంచి వ్యక్తి అని భరోసా ఇవ్వడంతో మా బంధం బలపడింది. అలా అక్టోబర్‌లో డేటింగ్ మొదలుపెట్టాం. మొత్తానికి ఒక్కటయ్యాం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ఇక పెళ్లికి ముందు తన అన్నయ్య అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి శిరీష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు పెళ్లిలో కొన్ని పనులు అనుకున్నట్లు జరగకపోవచ్చు, బట్టలు టైమ్‌కు రాకపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు.. దేనికీ టెన్షన్ పడకు. ఇవి నీ జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు, వీటిని మనస్ఫూర్తిగా ఆస్వాదించు’’ అని బన్నీ చెప్పారట.

Next Story