ట్యాగ్ పెట్టుకుని వైరల్ చేయడం నచ్చదు.. స్టార్ హీరోలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అడివి శేష్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-19 03:37:46  IST  )

‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడివి శేష్(Adivi Sesh) మంచి సక్సెస్ అందుకున్నాడు.

ట్యాగ్ పెట్టుకుని వైరల్ చేయడం నచ్చదు.. స్టార్ హీరోలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అడివి శేష్!
X

దిశ, సినిమా: ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడివి శేష్(Adivi Sesh) మంచి సక్సెస్ అందుకున్నాడు. అప్పటినుంచి చాలా విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ దాదాపు మంచి టాక్‌ను రాబట్టుకున్నాయి. ఇటీవల ‘హిట్-3’ మూవీలో కీలక పాత్రలో కనిపించిన అడివి శేష్ మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘డెకాయిట్’ (Dacoit)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా, ఈ సినిమా టీజర్ విడుదల చేయగా.. ఇందులో పాల్గొన్న అడివి శేష్ హీరోలు పెట్టుకునే ట్యాగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల కాలంలో హిట్ అయితే చాలు సెలబ్రిటఅలు పేరు పక్కన ట్యాగ్‌లు పెట్టుకుంటున్నారు.

కానీ మీరు వరుస హిట్స్ అందుకుంటున్నప్పటికీ ఎందుకు ట్యాగ్స్ పెట్టుకోలేదని యాంకర్ అడగ్గా.. ఇందుకు అడవి శేష్ సమాధానమిస్తూ.. ‘‘అందరిలాగా నాకు ట్యాగ్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఇలా ట్యాగ్ పెట్టుకుని వాటికి పీఆర్ టీమ్‌ని పెట్టి ఒక లోగో క్రియేట్ చేయించి వైరల్ చేయడం నాకు నచ్చదు. నాకు చిన్నప్పుడే మా అమ్మా, నాన్న నాకు ముందే ‘అడివి శేష్’ ట్యాగ్ ఇచ్చారు. అది ఒక్కటి చాలు నా కెరీర్ మొత్తానికి. అందుకే మరొకటి పెట్టుకోవాలనుకోవడం లేదు. నాకు ట్యాగ్స్ కంటే కూడా తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకోవడం ఇష్టం’’ అని క్లారిటీ ఇచ్చారు. అడివి శేష్ ట్యాగ్‌ల గురించి స్పష్టంగా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా, ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.

ఒక హిట్ పడితే ఓ ట్యాగ్.. రెండు హిట్స్ వస్తే ఇంకో బ్రాండ్ అనేలా ముందుకు సాగుతున్నారు కొంతమంది హీరోలు. అయితే అడివి శేష్ మాత్రం ఈ ట్రెండ్‌కు దూరంగా ఉంటూ, తనకున్న ప్రత్యేకతను కాపాడుకుంటున్నాడు. సినిమా అంటే కథ, పాత్ర, నటనలపై నమ్మకం ఉంచిన శేష్.. ‘‘ఒక మంచి సినిమా చేస్తే అది పరిశ్రమలో నన్ను నిలబెట్టుతుంది. కానీ ట్యాగ్‌లు పెట్టుకున్నా, అభిమానులు నన్ను అంత పెద్దగా గుర్తుపెట్టుకుంటారని అనుకోను’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రెండు, మూడు ట్యాగ్స్ పెట్టుకుంటున్న హీరోలకు కౌంటర్ ఇచ్చారని? పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More..

దొంగలుగా మారిన టాలీవుడ్ హీరో, హీరోయిన్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఫొటోలు

Next Story