దొంగలుగా మారిన టాలీవుడ్ హీరో, హీరోయిన్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఫొటోలు

by I. Sairam |   (  Updated:2025-12-19 03:38:33  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్ (Adivi Sesh), యంగ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్‌’ (Dacoit).

దొంగలుగా మారిన టాలీవుడ్ హీరో, హీరోయిన్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్ (Adivi Sesh), యంగ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్‌’ (Dacoit). ఈ మూవీకు షానీల్‌ డియో(Shanil Deo) దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాతోనే అతను ఇండస్ట్రీకి పరిచయం కానుండటం విశేషం. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మిస్తుంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్(Anurag Kashyap) కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

అయితే ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర‌బృందం సినిమా టీజర్‌(Teaser)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజ‌ర్ ఫుల్ యాక్ష‌న్ డ్రామాగా ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో అడివిశేష్‌, మృణాల్ ఠాకూర్ దొంగ‌లుగా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వైరల్ అవుతున్న ఫొటోస్‌లో అడివి శేష్, మృణాల్ మొహాలకు మాస్కులు పెట్టుకుని కార్ మీద కూర్చోని దొంగల గెటప్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చారు. అలాగే సింగిల్‌గా, జంటగా మాస్కులు తీసి కూడా పిక్స్‌కు పొజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

ట్యాగ్ పెట్టుకుని వైరల్ చేయడం నచ్చదు.. స్టార్ హీరోలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అడివి శేష్!


Next Story