- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లామర్ డాల్‌గా ఉండటం నాకు ఇష్టం లేదు.. అలాంటి పాత్రలే చేస్తానంటున్న అనస్వర రాజన్!
నాకు ఒకే రకమైన పాత్రలు చేయడం అస్సలు నచ్చదు. అలాంటి పాత్రల వల్ల నటిగా నాకు ఎటువంటి ఎదుగుదల ఉండదు.

దిశ, సినిమా: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చి, అతి తక్కువ కాలంలోనే దక్షిణాది సినీ ప్రియుల మనసు గెలుచుకున్న నటి అనస్వర రాజన్. 2017లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది, కేవలం తొమ్మిదేళ్ల ప్రయాణంలోనే 30 సినిమాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ తన సత్తా చాటుతూ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగులో 'ఛాంపియన్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. అంతేకాకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవల ఈ భామ నటించి ‘విత్ లవ్’ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కథలు ఎంచుకునే విషయంలో అనస్వర అచీతూచీ అడుగులు వేస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుందో వివరించింది. "నాకు ఒకే రకమైన పాత్రలు చేయడం అస్సలు నచ్చదు. అలాంటి పాత్రల వల్ల నటిగా నాకు ఎటువంటి ఎదుగుదల ఉండదు. నేను ఎప్పుడూ కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను" అని అనస్వర కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.
ప్రస్తుతం చేతినిండా కథలు ఉన్నప్పటికీ, అనస్వర చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటోంది. "సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు నా పాత్ర గురించి చర్చించుకోవాలి. 'ఈ అమ్మాయి ఇంత కష్టమైన పాత్రను ఎంత బాగా చేసింది!' అని వాళ్లు అనుకుంటేనే నాకు నటిగా అసలైన తృప్తి కలుగుతుంది. బరువైన, బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రల కోసమే నేను ఎదురుచూస్తున్నాను" అని ఆమె తెలిపింది. నటిగా తనను తాను నిరూపించుకోవాలంటే వైవిధ్యమైన కథలు అవసరమని ఆమె గట్టిగా నమ్ముతోంది. అనస్వర రాజన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన 30 సినిమాల్లో ప్రతి పాత్రలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నించింది. కేవలం తెరపై అందంగా కనిపిస్తే సరిపోదని, పాత్రలో లోతు ఉండాలని ఆమె కోరుకుంటోంది. భవిష్యత్తులో కూడా సవాలుతో కూడిన పాత్రలనే ఎంచుకుంటానని, దానివల్ల వచ్చే కష్టాన్ని తాను ఇష్టపడతానని చెప్పడం ఆమె అంకితభావాన్ని తెలియజేస్తోంది. మొత్తానికి, అనస్వర రాజన్ కేవలం ఒక గ్లామర్ డాల్‌గా మిగిలిపోవాలని అనుకోవడం లేదు. ఒక పక్కా పర్‌ఫార్మర్‌గా ఎదగాలని చూస్తున్న ఈ మలయాళ కుట్టి, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలతో మనల్ని అలరించడం ఖాయం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






