ఆ రోజు వరకు ఉంటామో పోతామో అర్థం కావట్లేదు.. సిద్దు జొన్నలగడ్డ షాకింగ్ ట్వీట్..

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న మూవీ ‘ఓజీ’(OG).

ఆ రోజు వరకు ఉంటామో పోతామో అర్థం కావట్లేదు.. సిద్దు జొన్నలగడ్డ షాకింగ్ ట్వీట్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న మూవీ ‘ఓజీ’(OG). అలాగే సెలబ్రిటీలు సైతం ఈ సినిమా విడుదల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో పవర్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. దీంతో అభిమానులు వేచి ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా పోస్టులతో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా, వీరి జాబితాలోకి టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ చేరాడు. ‘ఓజీ’ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలిపాడు. ‘‘ఓజీ హైప్ ప్రభావం మా హెల్త్‌పై పడేలా ఉంది. సెప్టెంబర్ 25 వరకూ మేం ఉంటామో, పోతామో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక 25 తర్వాత మా పరిస్థితి ఏంటో. మీరు పవన్ కాదు.. మీరు గాలి తుపాను’’ అని రాసుకొచ్చాడు. అలాగే పవన్‌ కళ్యాణ్‌తో పాటు సుజీత్‌ని ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

link

Next Story