- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ఆయనపై నమ్మకం లేదు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదంటూ రాజమౌళి కామెంట్స్..ఏకిపారేస్తున్న నెటిజన్లు
రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh Babu) ‘SSMB-29’ సినిమా ఈవెంట్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా జరిగింది.

దిశ, సినిమా: రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu)‘SSMB-29’ సినిమా ఈవెంట్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కు మూవీ టీమ్‌తో పాటు మహేష్ బాబు అభిమానులు భారీగా తరలివచ్చారు. అలాగే ఇందులో మహేష్ ఎంట్రీని రాజమౌళి స్పెషల్‌గా ప్లాన్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘వారణాసి’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. ఈ వేడుకల్లో భాగంగా రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
అసలేం జరిగిందంటే.. ఈ ఈవెంట్‌లో హనుమంతుడి మీద చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ‘‘నాకు దేవుడు మీద నమ్మకం లేదు. కానీ ఇందాక నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు నాతో మాట్లాడుతూ టెన్షన్ పడకు అంతా హనుమాన్ చూసుకుంటాడని అని చెప్పారు. నీ వెనకుండి నడిపిస్తాడని అన్నారు. కానీ ఇందాక సాంకేతిక లోపం కారణంగా ఈవెంట్ ఆగినప్పుడు ఇలానేనా నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్యకు హనుమాన్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయనతో ఓ ఫ్రెండ్‌తో మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది.
కానీ ఎందుకు ఈ ఈవెంట్ ఆగిపోయినా దేవుడు ఎలాంటి సాయం చేయలేదని కోపం వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సాంకేతిక సమస్య మీ దగ్గర పెట్టుకుని దేవుడిని అంటావా? చిన్న సమస్యలకు కూడా హనుమాన్‌ను నిందిస్తున్నావా? అని భక్తులు మండిపడుతున్నారు. దేవుడి మీద నమ్మకం లేదని చెప్తూ.. అదే కాన్సెప్టులతో సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నావ్ ఆయన వల్ల కాదా? అని పలు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం డైరెక్టర్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.






