అందరి ముందు అతను అలా అనేశాడు.. బాధను తట్టుకోలేకపోయానంటూ అపర్ణ బాలమురళి ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

నటి అపర్ణ బాలమురళి(Aparna Balamurali) ‘మిరాజ్’ (Mirage)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అందరి ముందు అతను అలా అనేశాడు.. బాధను తట్టుకోలేకపోయానంటూ అపర్ణ బాలమురళి ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: నటి అపర్ణ బాలమురళి(Aparna Balamurali) ‘మిరాజ్’ (Mirage)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆసిఫ్ అలీ(Asif Ali)కి జంటగా నటించబోతుంది. ఈ చిత్రానికి జీతూ జోపెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 19న విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అపర్ణ బాలమురళి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. ‘‘గత కొద్ది కాలంగా నా గురించి కొంతమంది ఏదేదో వాగుతున్నారు. ఇలా అయిపోతున్నావ్ ఏంటని దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. వాటిని చూసి మొదట్లో చాలా బాధపడేదాన్ని.

కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశాను. ధృడంగా మారడానికి నాకు చాలా సమయం పట్టింది. ఈక్రమంలోనే.. ఒకసారి నేను చాలాదూరం ప్రయాణించిన తర్వాత విమానశ్రయంలో దిగాను. అప్పుడు ఓ వ్యక్తి సడెన్‌గా నా ఎదురొచ్చి ఏంటి ఇంతా లావైపోయావ్? అన్నాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు.. అందరి ముందు అలా అనేసరికి ఏం చేయాలో తెలియలేదు. షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడినుంచి వెళ్లిపోయాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఆ బాధను తట్టుకోలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు.. నెగెటివ్ కామెంట్లు పట్టించేకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story