పిచ్చి ము*డ అంటే బూతు పదం అని నాకు తెలియదు.. రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-14 05:50:12  IST  )

రాశీ ఖన్నా(Raashi Khanna), సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’.

పిచ్చి ము*డ అంటే బూతు పదం అని నాకు తెలియదు.. రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: రాశీ ఖన్నా(Raashi Khanna), సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాశీఖన్నా సిద్ధు జొన్నలగడ్డ కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిస్తుంటే తానొక పిచ్చి ము*డలా చూస్తూ ఉండిపోయానని అనేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆమెకు తెలిసి అన్నదా? లేక తెలియక అన్నదా అని అంతా అయోమయంలో పడిపోయారు. మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, రాశీ ఖన్నా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘‘నిజంగా అది బూతు పదమని నాకు తెలయిదు. అదొక క్యూట్ వర్డ్ అనుకున్నాను. అందుకే అలా అనేసాను. ఆ తర్వాత నా ఫ్రెండ్ అసలు విషయం చెప్పింది’’ అని చెప్పుకొచ్చింది. ఇక సిద్ధు జొన్నలగడ్డ సైతం స్పందిస్తూ.. ఈ సినిమాలో ఆ పదాన్ని బామ్మ క్యారెక్టర్‌కు ఉపయోగించారు. రాశీఖన్నా క్యూట్ వర్డ్ అనుకొని మాట్లాడింది.. తనకి తెలియదు అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. తెలియకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

లింక్

READ MORE ......

రాత్రంతా అలా చేయడం సవాలుగా మారింది.. మమిత బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story