- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదు..
విక్రాంత్(Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdhury)జంటగా నటించిన మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu).

దిశ, సినిమా: విక్రాంత్(Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdhury)జంటగా నటించిన మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu). ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ - మా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాను మీరంతా ఇష్టపడతారని అనుకున్నాము గానీ ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదు. నేను చేసిన కల్యాణి పాత్రకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్స్‌లో టూర్స్‌కు వెళ్లినప్పుడు ఆడియెన్స్ కల్యాణి క్యారెక్టర్ తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు.
ఇలాంటి గుడ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ పాత్రను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన ఘనత మా డైరెక్టర్ సంజీవ్ గారిదే. హీరో విక్రాంత్ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. అతనికి మరిన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఇక హీరో విక్రాంత్ మాట్లాడుతూ - మూవీ కోసం పడిన కష్టాన్ని మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారు. ఈ సినిమాతో నాకు ఒక ఫ్యామిలీని మీట్ అయినట్లు ఉంది. చాందినీ లేకుంటే ఇంత బాగా వచ్చేది కాదు. తను నాకు ఒక స్నేహితురాలిగా మారిపోయింది. ప్రేక్షుకులు పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాలని కోరుతున్నా. మీరు థియేటర్స్ కు వెళ్తేనే మా లాంటి కొత్త హీరోస్ కు లైఫ్ ఉంటుంది. మా మూవీకి మీరు ఇస్తున్న కలెక్షన్స్‌తో హ్యాపీగా ఉన్నాం’’ అని చెప్పారు.






