నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు..అసలు విషయం తెలిశాక అతనిపై కేసు పెట్టాలనుకున్నాను: సుమ

by Mallepaka Hamsa |

పలు షోలు, సినిమా ఈ వెంట్లతో స్టార్ హీరోయిన్ల కంటే ఫుల్ బిజీగా ఉండే సుమ కనకాల (Suma Kanakala)ప్రేక్షకులనే అలరించేందుకు రెడీగా ఉంటుంది.

నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు..అసలు విషయం తెలిశాక అతనిపై కేసు పెట్టాలనుకున్నాను: సుమ
X

దిశ, సినిమా: పలు షోలు, సినిమా ఈ వెంట్లతో స్టార్ హీరోయిన్ల కంటే ఫుల్ బిజీగా ఉండే సుమ కనకాల (Suma Kanakala)ప్రేక్షకులనే అలరించేందుకు రెడీగా ఉంటుంది. రోజులో ఎన్ని ఈవెంట్లు చేసినా సరే ఏ మాత్రం అలసి పోకుండా దర్శక నిర్మాతలపై, హీరోలపై పంచులు వేస్తూ జనాలను నవ్విస్తోంది. యాంకరింగ్‌తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించిన సుమ.. త్వరలో ఓ పోలీస్ పాత్రలో కనిపించనుంది. ప్రియదర్శి(Priyadarshi), ఆనంది జంటగా నటించిన ‘ప్రేమంటే’ (premante) సినిమాలో కానిస్టేబుల్‌గా కనిపించింది.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సుమ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనను డైరెక్టర్ మోసం చేశాడని ఫన్నీగా చెప్పింది. ‘‘ఎప్పుడూ ప్రోగ్రాం మనమే స్టార్ట్ చేస్తాం.. కానీ ఈ సారి గీత స్టార్ట్ చేసి చెక్కు కొట్టేసింది. నన్ను ‘ప్రేమంటే’ సినిమాలో ప్రియదర్శి పక్కన హీరోయిన్ తీసుకున్నామని చెప్పారు. కానీ దర్శి కంటే నా వయసు మరీ తక్కువ కావడంతో డైరెక్టర్ నవనీత్ వద్దన్నారు. ఆ తర్వాత పవర్ ఫుల్ పాత్ర అని చెప్పి పవర్ లెస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చారు.

ఆ విషయం నాకు రెండు సీన్లు చేశాక అర్థమైంది. నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను. కానీ కుర్రాడింకా పెళ్లి కాలేదని వదిలేశా. పెళ్లి చేసుకుంటే కేసు కంటే ఇంకోటి ఏముంటుంది. ఇందులో నా రోల్ ఆనంది కొట్టేసింది. అయినా పర్లేదు.. చాలా బాగా నటించింది. అయినప్పటికీ ఆమె కంటే నేను గ్లామర్‌గా కనిపించానని అంతా అంటున్నారు. ఇందులో నాకూడా ఓ పాట, హుక్ స్టెప్ ఉంది’’ అని చెప్పింది. ప్రస్తుతం సుమ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story