ఆ డైరెక్టర్ సెట్‌లో అలా చేయడంతో నా వల్ల కాక చాలా ఏడ్చేశాను.. మీనాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది.

ఆ డైరెక్టర్ సెట్‌లో అలా చేయడంతో నా వల్ల కాక చాలా ఏడ్చేశాను.. మీనాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేసుకుంటూ, ప్రతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. ‘గుంటూరు కారం’తో హిట్ అందుకున్న మీనాక్షి, గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నా’ సినిమాతో పెద్ద హిట్ అందుకుని వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju )సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty)కి జోడీగా నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారి దర్శకత్వం వహించాడు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న మీనాక్షి, తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. హిందీలో తన మొదటి ప్రాజెక్ట్‌గా ‘అవుట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న మీనాక్షి, ఆ సిరీస్ డైరెక్టర్ తిగ్మన్షు ధూళియ చాలా స్ట్రిక్ట్ అని తెలిపింది. “ఆయన చాలా సీనియర్. కానీ అది నా ఫస్ట్ సిరీస్. అప్పటికి సినిమాలే చేయలేదు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు” అంటూ చెప్పుకొచ్చింది.మొదటి రోజు షూటింగ్‌లోనే దర్శకుడు తనపై గట్టిగా మాట్లాడటంతో తాను పూర్తిగా కుంగిపోయానని చెప్పింది. “నాకు అసలు చేయలేనేమో అనిపించింది.

అక్కడే చాలా ఏడ్చేశాను. సినిమాలు మానేద్దాం అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. నా మేనేజర్‌కు ఫోన్ చేసి ఈ సిరీస్ నుంచి బయటకు వచ్చేస్తాను అన్నాను” అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. అయితే కాంట్రాక్ట్ ఉన్నందున తప్పనిసరిగా చేయాల్సి వచ్చిందని, అదే తన జీవితాన్ని మార్చేసిందని మీనాక్షి చెప్పింది. “అప్పుడు నుంచి నేను మరింత కష్టపడ్డాను.. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాను ఓపికగా నిలబడ్డాను. ఆ కష్టాలే ఇవాళ నన్ను ఈ స్టేజీ మీద నిలబెట్టాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story