- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మానాన్నల విడాకుల విషయం తెలిసి తట్టుకోలేకపోయా.. చాలా ఇబ్బందిగా అనిపించింది: రోషన్
బుల్లితెర యాంకర్ సుమ (suma)తనయుడు రోషన్ (Roshan Kanakala)హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ సుమ (suma)తనయుడు రోషన్ (Roshan Kanakala)హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’. నేషనల్ అవార్డు విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రోషన్ కనకాల ఫ్యామిలీ విషయాలు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మా అమ్మ నాన్న విడాకులు తీసుకుని విడిపోతున్నారని గతంలో వార్తలు వచ్చినప్పుడు.. చాలా బాధపడ్డాను. అసలు ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోయారు.
కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు వాటి గురించి అమ్మ చెప్పడంతో అస్సలు పట్టించుకోలేదు. ఈ వార్తలు విన్నప్పుడు కూడా ముందు ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఇంట్లో అమ్మానాన్ని ఎలా ఉంటారో మాకు తెలుసు కాబట్టి. వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవని వారిద్దరు సంతోషంగా ఉన్నారనే విషయంపై మాకు క్లారిటీ ఉండేది. అందుకే పట్టించుకోలేదు. అయితే విడాకుల వార్తలు వచ్చినప్పుడు మాత్రం చాలా మంది అవునా నిజమా అని ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. సమాధానం చెప్పలేక కాస్త ఇబ్బందిగా అనిపించింది. అమ్మానాన్న బయట ఉండేలా ఉండరు. ఇంట్లో చాలా సరదాగా ఉంటారని పేర్కొన్నాడు.
ఇక ఇలా ఎన్నోసార్లు విడాకులపై సుమ, రాజీవ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు. ఇప్పటికీ ఈ దంపతులు విడిపోతున్నారనే వార్తలు వస్తుండటం గమనార్హం. కాగా.. సుమ సినిమా ఈవెంట్, బుల్లితెర షోల్లో యాంకర్‌గా చేస్తూ ఫుల్ బిజీగా ఉండగా.. రాజీవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. వీరిద్దరు సినీ కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎన్ని పుకార్లు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు.






