ఈ సినిమా తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నా..

by Mallepaka Hamsa |

ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్(Aksa Khan), అలేఖ్య రెడ్డి (Alekhya Reddy)హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా రానున్న చిత్రం RK దీక్ష.

ఈ సినిమా తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నా..
X

దిశ, సినిమా: ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్(Aksa Khan), అలేఖ్య రెడ్డి (Alekhya Reddy)హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా రానున్న చిత్రం RK దీక్ష. ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో రాబోతుంది. తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించారు. తాజాగా, ఈ చిత్ర ట్రైలర్, సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు చిత్ర ప్రొడ్యూస్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత పితాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... "RK దీక్ష(RK deeksha) చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి అభిమానిగా ఆయన మూవీ పేరు మీద మరొక సినిమా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమాలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక పాట ఉంటుంది. హీరోగా కిరణ్, హీరోయిన్ గా ఢీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన అక్స ఖాన్ చేస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు. ఇక హీరోయిన్ అక్స ఖాన్... "మా చిత్రానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ట్రైలర్, సాంగ్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమాలో నేను కూడా కోరియోగ్రఫీ చేశాను. డాన్సర్ గా, నటిగా నన్ను మరింత ప్రోత్సహిస్తారని ప్రేక్షకులను ప్రార్థిస్తున్నాను" అన్నారు.

Next Story