- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > నేను వాళ్లలా ఆత్మాభిమానం చంపుకొని బతకలేను.. హీరోయిన్లపై కంగనా షాకింగ్ కామెంట్స్
నేను వాళ్లలా ఆత్మాభిమానం చంపుకొని బతకలేను.. హీరోయిన్లపై కంగనా షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో తనను పొగరుబోతుగా చూడటంపై కంగనా రనౌత్ ఆందోళన వ్యక్తం చేసింది.

X
దిశ, సినిమా: ఇండస్ట్రీలో తనను పొగరుబోతుగా చూడటంపై కంగనా రనౌత్ ఆందోళన వ్యక్తం చేసింది. నిజాయితిగా ఉంటున్న తనపై ఎందుకింత విద్వేషం అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో వాపోయింది. ‘నేను స్ట్రయిట్ ఫార్వాడ్‌గా ఉంటాను. నిర్మొమాటంగా మాట్లాడేస్తాను. నిజంలో బతుకుతాను. అది కొందరికి నచ్చట్లేదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతికేవాళ్లంతా లౌక్యం తెలిసినవాళ్లు. నిజాయితీగా ఉన్న నేను పొగరుబోతునా? నా సినిమాలపై కావాలనే కొందరు కక్షగట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈ మధ్య నా సినిమాలు సరిగా ఆడట్లేదు. మీడియా సైతం మిగతా హీరోయిన్ల విషయంలో సాఫ్ట్‌గా ఉంటుంది. నా విషయానికొచ్చేసరికే అవాకులు చవాకులు రాస్తున్నారు’ అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతుండగా తన ఫ్యాన్స్ మద్ధతుగా నిలుస్తూ పలు కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- kangana ranaut
Next Story






