- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను.. స్టార్ హీరోలతో నటించడంపై మమిత బైజు ఆసక్తికర కామెంట్స్
‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది యంగ్ హీరోయిన్ మమిత బైజు(Mamita Baiju). ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

దిశ, సినిమా: ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది యంగ్ హీరోయిన్ మమిత బైజు(Mamita Baiju). ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇటీవల ‘డ్యూడ్’ సినిమాతో వచ్చింది. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో మమితకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ అందాల తార కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్(dhanush), దళపతి విజయ్(Thalapathy Vijay), సూర్య(suriya)లతో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమిత బైజు మూడు సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్న అనుభవాన్ని పంచుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో 46వ సినిమాగా రాబోతున్న ప్రాజెక్ట్‌లో మమిత హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి చెప్తూ.. ‘‘నేను సూర్య సర్‌తో ‘వనంగాన్’ లో నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు నాకు ‘సూర్య 46’ లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అప్పుడు సూర్య సర్ నవ్వుతూ, చివరికి, మనం కలిసి పనిచేస్తున్నాం! అని అన్నారు. ఆ క్షణం నాకు చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పింది. ఇక ధనుష్‌తో ‘D-54’లో జతకట్టబోతోంది. ‘‘షూటింగ్ సమయంలో ధనుష్ సర్ నాకు చాలా సహాయం చేశారు. ఒకప్పుడు, నేను అతని నటన చూసి చాలా షాక్ అయ్యాను. నన్ను నేను మర్చిపోయాను!. అటువంటి అద్భుతమైన నటులతో పనిచేయడం నిజంగా సంతోషకరమైన అనుభవం అని తెలిపింది.
అలాగే విజయ్ ‘జన నాయగన్’లో కీలక పాత్రలో నటించడం.. ‘‘విజయ్ సర్‌తో కలిసి నటించడం.. కల నిజమైనట్లుగా అనిపిస్తోంది. ‘జన నాయగన్’ షూటింగ్ మొదటి రోజే, నేను నిజంగా ఆయనతో కలిసి పనిచేస్తున్నానా? అని నమ్మలేకపోయాను. ఆయనను చూసి సెట్‌లో చాలా భయపడ్డాను. కానీ విజయ్ సర్ నా దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా మాట్లాడారు. ప్రశాంతంగా ఉండమని ధైర్యం చెప్పారు. అది నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది.






