‘ఉగ్రం’.. ‘నాంది’ కంటే పదిరెట్లు ఆదరిస్తారనే నమ్మకముంది: నరేష్

by Disha Web Desk 7 |
‘ఉగ్రం’.. ‘నాంది’ కంటే పదిరెట్లు ఆదరిస్తారనే నమ్మకముంది: నరేష్
X

దిశ, సినిమా : అల్లరి నరేష్, విజయ్ కనకమేడల నయా చిత్రం ఉగ్రం’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ మే 5న విడుదలకానుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. దీనికి అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, విఐ ఆనంద్, వశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు మూవీ చూసిన తర్వాత అందరూ యాంగ్రీ నరేష్ అనే పిలుస్తారని అడివి శేష్ చెప్పగా.. నరేష్ డబుల్ బ్లాక్ బస్టర్ కొడతాడని నిఖిల్ అన్నాడు.

అలాగే నరేష్ అన్న మాస్ తనకు చాలా ఇష్టమని సందీప్ కిషన్ తెలుపగా..ఈ ట్రైలర్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయంటూ విశ్వక్ సేన్ ప్రశంసలు కురిపించాడు. ప్రేక్షకులు విజువల్ థ్రిల్ పొందబోతున్నారు. నాది హామీ అంటూ హరీష్ శంకర్ పొగిడేయగా నటుడిగా నరేష్ ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే వుంటాడని అనిల్ రావిపూడి అన్నాడు. చివరగా తన 60వ చిత్రాన్ని ‘నాంది’ కంటే పదిరేట్లు ఎక్కువగా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నాడు నరేష్. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది

Next Story

Most Viewed