మీ రియాక్షన్ చూడటానికి నేను వెయిటింగ్.. ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ

by Disha Web Desk 7 |
మీ రియాక్షన్ చూడటానికి నేను వెయిటింగ్.. ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ
X

దిశ, సినిమా: మాస్ మహారాజ రవితేజ తాజా సినిమా ‘ఈగల్’. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి నెలలో రావాల్సి ఉండగా.. థియేటర్ల కొరతతో ఫిబ్రవరి 9 కి పోస్ట్ పోన్ అయింది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ‘ఈగల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్విహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకుడు అనుదీప్ కె.వి, శ్రీరామ్ ఆదిత్య, వంశీ హాజరచ్చారు.

ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘చాలా టైం అయింది. అయినా నేను మాట్లాడేది ఏముంది. ఇందులో యాక్టర్స్ అందరితో నేను ఫస్ట్ టైం నటిస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే సీనియర్. నవదీప్‌ది చాలా మంచి క్యారెక్టర్. ఎప్పటినుంచో నవదీప్‌కి ఓ సాలిడ్ క్యారెక్టర్ పడాలి అనుకుంటున్నాను.. ఈ సినిమాతో అతడికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో అతడు చెప్పిన డైలాగులు అసలు ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయరు. ట్రైలర్, టీజర్ కాదు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. అలాగే నవదీప్‌తో కలిసి ఓ కామెడీ సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇతడిలో విపరీతమైన వెటకారం ఉంది. మిగతా యాక్టర్లు అందరూ కూడా చాలా బాగా నటించారు. మీరందరూ మాకు ఆల్ ది బెస్ట్ చెప్పంది. సినిమా అవుట్ పుట్ అయితే అదిరింది. ఇక ప్రేక్షకుల రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story