- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనీత్ పద్దా(Aneeth Padda)అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనీత్ పద్దా(Aneeth Padda)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘సైయారా’ (Saiyaara)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.. అహాన్ పాండే(Ahan Pandey) హీరోగా నటించిన ఈ మూవీని మోహిత్ సూరి తెరకెక్కించారు. ఇందులో క్రిష్, వాణి కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు కూడా రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ సినిమాతో అనీత్ పద్దా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇటీవల ఈ మూవీ రూ. 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఇక ‘సైయారా’ సక్సెస్ అవడంపై ఈ అమ్మడు స్పందించింది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఆ మైకం తొలగిపోతోంది. నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు తెలియదు.
కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలుసు. నువ్వు నాకు ఇచ్చిన ప్రేమతో నాహృదయం బరువెక్కిపోయింది. దానిని తిరిగి ఇవ్వడం తప్ప నాకు ఏమి చేయాలో తెలియదు. తర్వాత ఏమవుతుందో అని ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది. నాకు తగిన పాత్ర వస్తుందో లేదో అని నాకు భయంగా ఉంది. కానీ నా దగ్గర ఉన్న టాలెంట్‌ను బయట పెట్టాలనుకుంటున్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది నన్ను భయపెడుతుంది. అది పరిపూర్ణంగా లేకపోయినా, నా దగ్గర ఉన్నవన్నీ నేను దానికి ఇస్తాను’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






