- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బ్యాడాస్’ సినిమా విషయంలో చాలా భయంగా ఉంది: సిద్ధు జొన్నలగడ్డ
డిజే టిల్లుతో యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని.. విభిన్న పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

దిశ, సినిమా: డిజే టిల్లుతో యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని.. విభిన్న పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ గత కొద్ది కాలంగా సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda)కు కలిసిరావడం లేదు. ‘డిజే టిల్లు’ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక ఈ సారి ఎలాగైనా సిద్ధు హిట్ అందుకోవాలన్న కసితో ‘బ్యాడాస్’(Badass) అంటూ ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. రవికాంత్ పేరేపు(Ravikanth Perepu) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలై.. అంచనాలను పెంచింది.
కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ ‘బ్యాడాస్’ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతుందో వెల్లడించాడు. ‘‘బ్యాడాస్ అనేది తండ్రీ కొడుకుల భావోద్వేగాలో రాబోతున్న పెద్ద యాక్షన్ డ్రామా చిత్రం. ఈ సినిమా కోసం నేను ఎక్జైటింగ్‌గా ఉన్నాను. అలాగే నాకు చాలా భయంగా కూడా ఉంది. చాలా ఆందోళనగా ఉన్నాను. అన్ని బౌండరీస్ చెరిపేసేది ‘బ్యాడాస్’. ఈ సినిమా విషయంలో రవికాంత్‌కు ఎక్జైటింగ్ ఐడియాస్ వస్తున్నాయి. మీరు ఊహించని విధంగా ఉండబోతుంది. మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండండి’’ అని చెప్పుకొచ్చాడు.






