- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేటింగులు చూసి చాలా బాధపడ్డా.. ఎందుకింత పక్షపాతం చూపిస్తున్నారంటూ నిర్మాత ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)నటించిన లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’(K-Ramp).

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)నటించిన లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’(K-Ramp). జైన్స్ నాని తెరకెక్కించిన ఈ చిత్రంలో యుక్తి తరేజా (Yukhti Tareja)హీరోయిన్‌గా నటించగా.. మురళీధర్ గౌడ్, సాయికుమార్, వెన్నెల కిషోర్, నరేష్, కామ్నా జెఠ్మలాని కీలక పాత్రలో కనిపించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే మొదటి షో నుంచి ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సినిమాకు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా, ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నిర్మాత రాజేశ్ దండా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘రేటింగులు చూసి చాలా బాధపడ్డా.. చిన్న నిర్మాతనని పక్షపాత వైఖరి చూపిస్తున్నారు.. రేటింగులు ఇచ్చేవాళ్లు 'బాహుబలి' సినిమానూ 'K-Ramp' ను ఒకేలా చూడాలి.
ట్విట్టర్‌లో రివ్యూలు ఇచ్చే కొందరు కొన్ని సినిమాలకు త్వరగా రివ్యూ ఇస్తున్నారు. ఇంకొన్ని ప్రాజెక్టులకు రివ్యూ త్వరగా ఇచ్చినగా ఫైనల్ రేటింగ్ ఎప్పటికో డిసైడ్ చేస్తున్నారు. ఇంత పక్షపాతం ఎందుకు చిన్న నిర్మాత ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా? ఇది నాలాంటి ఎంతోమంది నిర్మాతల సమస్య. K RAMP కి ఎందుకు PARTIALITY చూపిస్తున్నారు, నేను చాలా బాధపడుతున్నాను, వేరే సినిమాలకి మా సినిమాలకి వచ్చే కలెక్షన్స్ చూడండి, రేటింగ్స్ చూడండి. నా మూవీ కలక్షన్లు చెప్పుకొని డప్పు కొట్టుకోవడం నాకిష్టం లేదు అందుకే చెప్పడం లేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.






