పెద్ద స్టార్ అయి ఉండి నన్ను ప్రోత్సహించడం నాకెంతో గర్వంగా ఉంది: రాషా తడాని

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-05 15:59:32  IST  )

బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని(Rasha Tadani) కేవలం నటనకే పరిమితం కాకుండా, సింగింగ్‌లోనూ తన సత్తా చాటుతోంది.

పెద్ద స్టార్ అయి ఉండి నన్ను ప్రోత్సహించడం నాకెంతో గర్వంగా ఉంది: రాషా తడాని
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని(Rasha Tadani) కేవలం నటనకే పరిమితం కాకుండా, సింగింగ్‌లోనూ తన సత్తా చాటుతోంది. అభయ్ వర్మతో కలిసి నటిస్తున్న 'లైకీ లైకా' (Laikey Laikaa)చిత్రంలో ఆమె స్వయంగా ఒక పాట పాడి యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాట విడుదలైన తర్వాత నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా, టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ నుంచి ప్రశంసలు దక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాషా తడాని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు సంగీతం, నృత్యం, నటన అంటే చాలా ఇష్టం. ఐదేళ్ల వయసులో నేను గులాం ముస్తఫా ఖాన్ కుమారుడైన ఖాదిర్ ముస్తఫా ఖాన్ వద్ద హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ప్రారంభించాను. నేను జాజ్ సంగీతం కూడా నేర్చుకున్నాను.

సంగీతం ఒక విముక్తి లాంటిది, మీరు మీ సాధన చేసే ఆ ఒక్క గంట మీకు మీకంటూ లభించే సమయం. నేను స్నానం చేసేటప్పుడు పాటలు పాడటంలో పూర్తిగా మునిగిపోతాను. ఇప్పుడు సంగీత పరిశ్రమలో అడుగు పెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఈ సంగీతం నాకు ఒక ప్రశాంతతను ఇస్తుంది. నేను ఒక 'షవర్ సింగర్'ని, ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం నా కల నిజమైనట్లుగా ఉంది’’ అని రాషా తెలిపింది. పాటలో వినిపించే డమరుకం శబ్దాల గురించి రాషా స్పందిస్తూ.. ‘‘నేను 12 జ్యోతిర్లింగాల యాత్రను పూర్తి చేశాను. శివుడు మతపరంగానే కాకుండా నా జీవితంలో ఒక భాగంగా మారిపోయాడు.

ఈ పాటలో డమరుకం మోగుతుంటే నాకు నటరాజ స్వామి నాట్యమే గుర్తొస్తుంది. అందుకే నాలోని ఈ కళను ఆ పరమశివుడికే అంకితం చేస్తున్నాను’’ అని తన భక్తిని చాటుకుంది. రాషా పాట విన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందించడంపై రాషా స్పందిస్తూ.. ‘‘ప్రభాస్ గారు నాకు పెద్ద ఇన్సిపిరేషన్. ఆయన అంత పెద్ద స్టార్ అయి ఉండి, నన్ను ప్రోత్సహించడం చాలా గర్వంగా ఉంది. ఆయన ఇచ్చిన బూస్టింగ్ నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది’’ అంటూ రాషా ఎమోషనల్ అయింది.

Read More.. చెదిరిన చోటే మళ్లీ మొదలైన కల.. నమ్మలేకపోతున్నానంటూ రియా ఎమోషనల్ పోస్ట్

Next Story