- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊహించని మలుపులతో ‘మిస్టీరియస్’.. ఈ ప్రాజెక్ట్ చేయడం సంతృప్తిగా ఉంది: జయ్ వల్లందాస్
మహి కోమటిరెడ్డి(Mahi Komatireddy) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టీరియస్’(Mysterious).

దిశ, సినిమా: మహి కోమటిరెడ్డి(Mahi Komatireddy) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టీరియస్’(Mysterious). ఇందులో రోహిత్(Rohit), రియా కపూర్, మేఘనా రాజ్ పుత్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్‌న నిర్మాత జయ్ వల్లందాస్ తెలిపారు. ‘‘మా ‘మిస్టీరియస్’ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. నేను యూఎస్‌లో ఉంటాను. సినిమా రంగం మీద ఆసక్తితో టాలీవుడ్‌కు వచ్చాను. నా స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిని చేయాలనే సంకల్పంతో ‘మిస్టీరియస్’ చిత్రాన్ని నిర్మించాను.
ఈ మూవీ స్టోరీ మహి చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. తొలి ప్రయత్నంలో ఒక కథా బలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించడం సంతృప్తిగా ఉంది. ఇన్నోవేటివ్ స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో, ఊహించని మలుపులతో సినిమా సాగుతూ ప్రేక్షకులకు ఆద్యంతం కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. ఇందులోని ప్రతి పాత్ర అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మా యంగ్ టీమ్ చేసిన ప్రయత్నాన్ని తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నా. ‘మిస్టీరియస్’ సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు నిర్మించాలనే ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.






