- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను నిజంగా చాలా బాధపడ్డాను.. ‘కూలీ’లో నటించడంపై రెబా మౌనిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ బ్యూటీ రెబా మోనికా జాన్(Reba Monica John) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘జోకోబింటే స్వర్గరాజ్యం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రెబా మోనికా జాన్(Reba Monica John) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘జోకోబింటే స్వర్గరాజ్యం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత తమిళ, మలయాళ భాషల్లో నటించి మెప్పించింది. తెలుగేలో సామజవరగమన చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ చెక్కేసింది. ఇక ఇటీవ రెబా ‘కూలీ’(coolie) సినిమాలో కీలక పాత్రలో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 14 విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో రాణిస్తోంది.
ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెబా మోనికా ‘కూలీ’లో నటించడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఆకాశవాణి వెబ్ సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రవీణ్ వర్క్ చేశాడు. అతనే ‘కూలీ’కి వర్క్ చేశాడు. మేము మంచి ఫ్రెండ్స్ కావడంతో అతను నాకు చెప్పాడు. దీంతో నేను నేను తలైవార్‌కు పెద్ద అభిమానిని నువ్వు లక్కీ ఆయనతో వర్క్ చేయబోతున్నావ్ అవకాశం ఉందో అడుగు అని చెప్పాను. నేను కచ్చితంగా చెప్తాను నీకు మంచి జరుగుతుందంటే తప్పకుండా చేస్తాను అన్నారు. కొద్ది రోజులపాటు ఎదురుచూడగా.. అప్పుడే లోకేష్ సర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆఫీసుకి వచ్చి కలవమన్నారు.
నీకు ఈ పాత్ర ఇవ్వడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది చిన్న క్యారెక్టర్ మాత్రమే అని అన్నారు. అయినప్పటికీ అది నాకు ఇవ్వండి సార్ మళ్లీ సూపర్ స్టార్‌తో నటించే అవకాశం వస్తుందో లేదో అన్నాను. చిన్న పాత్ర అని చెప్పడానికి నాకేం బాధగా లేదు. ఎందుకంటే నేనే నిర్ణయం తీసుకున్నాను. నేను నిజంగా బాధపడ్డాను, నిరాశ చెందాను. నేను ఇంకా చాలా అందించగలిగాను, కానీ కొన్నిసార్లు అనుకున్నట్లుగా పనులు జరగవు. అయినప్పటికీ, కూలీలో రజనీకాంత్ సర్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞురాలిని’’ అని చెప్పుకొచ్చింది.






