- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Renu Desai: ఆయన పిలిస్తే అన్ని వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా.. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పలు కామెంట్లు చేయడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఇటీవల రేణు దేశాయ్ తాను సన్యాసం తీసుకుంటానని చెప్పిన కామెంట్లు నెట్టింట దుమారం రేపాయి. గతంలో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పిన రేణు దేశాయ్ సడెన్‌గా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమై ఉంటాయని అంతా ఆలోచనలో పడ్డారు. ఓ వైపు జంతువులకు ఏ కష్టంగా రాకుండా చూసుకుంటున్న ఆమె తన పిల్లల బాధ్యతను కూడా తీసుకున్నారు. వారికి నచ్చిన ఫీల్డ్‌లో రాణించేందుకు సపోర్ట్‌గా ఉంటుంది.
అలాగే అన్ని పండుగలు జరుపుకోవడంతో పాటు పిల్లలకు కూడా వాటి విలువను తెలిజచేస్తోంది. తరచుగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు పిల్లలను కూడా తనతో పాటే తీసుకెళ్తోంది. తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కాశీ క్షేత్ర పాలకుడు కాల భైరవుడు జయంతి సందర్భంగా దర్శనం చేసుకున్న ఆమె ఇలా రాసుకొచ్చింది. ‘‘కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరుకోకూడదు. మనమే రక్షకుడిగా మారాలి. కాల భైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమేశ్వరుడు పిలిచినప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీకి వెళ్తారు. నేను కూడా అంతే శివుడు పిలిచినప్పుడు అన్ని వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే కొన్ని ఫొటోలను షేర్ చేసింది.






