అలా అన్నందుకు తమన్నా కాళ్లు పట్టుకోవడానికైనా నేను సిద్ధమే.. నటుడు షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నేను ఇదే మాటను ఇంగ్లీష్‌లో చెప్పి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ హిందీలో చెప్పేసరికి నా వయసును ప్రస్తావిస్తూ నన్ను ట్రోల్ చేశారు.

అలా అన్నందుకు తమన్నా కాళ్లు పట్టుకోవడానికైనా నేను సిద్ధమే.. నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ గతంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘స్త్రీ-2’ సినిమాలో తమన్నా చేసిన ‘ఆజ్ కీ రాత్’ ఐటమ్ సాంగ్‌లో ఆమె రూపాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఈ వివాదంపై అన్నూ కపూర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నూ కపూర్ మాట్లాడుతూ.. తమన్నా చాలా తెల్లగా ఉంటుందని, ఆమె డ్యాన్స్ గురించి హిందీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఆమె శరీరాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ విన్న నెటిజన్లు, ఆయనపై విమర్శలు గుప్పించారు. వయసులో పెద్దవాడై ఉండి ఒక నటి రూపాన్ని అలా వర్ణించడం తగదని, ఆయన మాటల్లో దురుద్దేశం ఉందంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఈ విమర్శలపై అన్నూ కపూర్ ఘాటుగా స్పందించారు. భాష మార్పిడి వల్లే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు."నేను ఇదే మాటను ఇంగ్లీష్‌లో చెప్పి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.

కానీ హిందీలో చెప్పేసరికి నా వయసును ప్రస్తావిస్తూ నన్ను ట్రోల్ చేశారు. భాష మారినంత మాత్రాన అర్థం మారిపోదు కదా!" అని ఆయన ప్రశ్నించారు. ఒక వ్యక్తి అందాన్ని మెచ్చుకోవడంలో తప్పు లేదని, తాను కేవలం ఆమె రూపాన్ని పొగిడాను తప్ప దురుద్దేశంతో అనలేదని స్పష్టం చేశారు. అన్నూ కపూర్ తన నిజాయితీని నిరూపించుకునే క్రమంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. "నా మనసులో ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు లేవు. ఒకవేళ నేను చేసిన కామెంట్స్ వల్ల తమన్నా మనస్తాపానికి గురై ఉంటే, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికైనా నేను వెనుకాడను. నా మనసు స్వచ్ఛంగా ఉంది కాబట్టి ఆమె కాళ్లు పట్టుకోవడం నాకు పెద్ద సమస్యే కాదు" అని ఆయన తెగేసి చెప్పారు. అన్నూ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు దారితీశాయి. కొందరు ఆయన నిజాయితీని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సీనియర్ నటుడిగా మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై తమన్నా ఇంకా స్పందించాల్సి ఉంది.

Next Story