- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా విజయాన్ని ఆయనకు ట్రిబ్యూట్ చేస్తున్నా.. ఎన్టీఆర్ మీదున్న ప్రేమను మాటల్లో చెప్పలేను: కీరిటి రెడ్డి
గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెట్టి (kireeti reddy)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జూనియర్’ (junior).

దిశ, సినిమా: గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెట్టి kireeti reddy)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జూనియర్’ (junior). ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ(radha krishna) తెరకెక్కిస్తుండగా.. వారాహి చలచచిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఇందులో కిరీటి రెడ్డి సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల (sreeleela) హీరోయిన్‌గా నటించగా.. జెనీలియా, రావు రమేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘జూనియర్’ మూవీ జూలై 18న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న కిరీటి రెడ్డి ఎన్టీఆర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘నా సినిమాలోని మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే నేను శ్రీలీలతో సమానంగా డ్యాన్స్ వేశానని అంతా మెచ్చుకుంటున్నారు. ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఈ సాంగ్ విజయాన్ని ఆయనకు ట్రిబ్యూట్ చేస్తున్నాను. తారక్ డ్యాన్స్, నటన, వ్యక్తిత్వం అంటే నాకెంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా కలిసే చాన్స్ వస్తే సంతోషపడతాను. నా సినిమా వేడుకకు గెస్ట్‌గా వస్తే జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఆయన్ను కలిస్తే అదృష్టంగా భావిస్తాను. అమ్మ మీ ప్రేమను, ఎన్టీఆర్ మీద ప్రేమను మాటల్లో చెప్పలేము. అలా అని ఇతర హీరోల అభిమానులను తక్కువ చేయడం లేదు. నాకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన తారక్ ఫ్యాన్స్ కిరీటి రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






