చికిత్స లేని వ్యాధితో నరకం చూస్తున్నా.. ఆ నొప్పి భరించలేకపోతున్నానంటూ నటి ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాల్టీ చాహర్ (Malti Chahar)తాను ఓ ప్రమాదకరమైన వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది.

చికిత్స లేని వ్యాధితో నరకం చూస్తున్నా.. ఆ నొప్పి భరించలేకపోతున్నానంటూ నటి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాల్టీ చాహర్ (Malti Chahar)తాను ఓ ప్రమాదకరమైన వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. తాను 7వ తరగతి చదువుతున్నప్పటికీ ‘అడెనోమైయోసిస్’ అనే వ్యాదితో నరకం అనుబవిస్తున్నట్లు తెలుపుతూ ఎమోషనల్ అయింది. ఈ వ్యాధి రుతుక్రమానికి సంబంధించినదని దానికి చికిత్స లేదని తెలిపింది. ‘‘నాకు అడెనోమయోసిస్ అనే సమస్య ఉంది. దీని కారణంగా తీవ్ర రుతుక్రమ నొప్పితో బాధపడుతున్నాను. ఈ వ్యాధి కారణంగా నేను దాదాపు ప్రతి నెల ఆసుపత్రిలో చేరాల్సి వచ్చేది. దీనికి చికిత్స లేదు. హార్మోన్ల మందులు తీసుకోవచ్చని వైద్యులు సూచించినప్పటికీ, వాటి దుష్ప్రభావాల కారణంగా వాటిని ఉపయోగించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ రోజుకీ కూడా నేను నిరంతర నొప్పితో నరకం చూస్తున్నాను. కానీ ఈ నొప్పిని చాలా మంది సీరియస్‌గా తీసుకోరు. ‘అందరికీ ఇలాగే ఉంటుంది, ఇందులో వింత ఏముంది?’ అనే వైఖరితో చూస్తారు. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నా నొప్పిని, నన్ను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు.

నా సమస్యను వివరించడం నాకు ఎంతో కష్టంగా మారిందని’’ చెప్పింది. అలాగే తన కుటుంబ పరిస్థితుల గురించి మాల్టీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల మధ్య తీవ్రమైన గొడవలు జరిగేవని, తనపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు. అవన్నీ చూసి భరించాల్సి వచ్చేది. మా తమ్ముడు క్రికెట్ ఆడటం మొదలుపెట్టడంతో, ఆ గొడవల నుంచి కొంత దూరంగా ఉండేవాడు” అని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ విషయంలోనూ ఎన్నో పరిమితులు ఎదుర్కొన్నానని మాల్టీ తెలిపారు. మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని, వినోద పరిశ్రమలో కెరీర్ చేయాలనుకుంటున్నానని తండ్రికి చెప్పగా, ఆయన మాత్రం తనను ఐపీఎస్ అధికారిని చేయాలనుకున్నారని వెల్లడించారు. చదువుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో 11వ తరగతి వరకు తనను బలవంతంగా పొట్టి జుట్టుతో ఉంచారని, ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వలేదని, ఈ నియంత్రణలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని మాల్టీ చాహర్ ఎమోషనల్ అయింది.

Next Story