అతని వల్ల శారీరకంగా, మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాను.. ఆర్జీవీ బ్యూటీ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ‘వంగవీటి’ సినిమాతో నైనా గంగూలీ(Naina Ganguly) హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

అతని వల్ల శారీరకంగా, మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాను.. ఆర్జీవీ బ్యూటీ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ‘వంగవీటి’ సినిమాతో నైనా గంగూలీ(Naina Ganguly) హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జోహర్, మళ్లీ మొదలైంది, డేంజరస్(Dangerous) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో పలు సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్‌ను రాబట్టుకుంది. గత మూడేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, నైనా గంగూలీ తన పర్సనల్ లైఫ్ విషయాలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన బాయ్‌ఫ్రెండ్ వేధిస్తున్నట్లు తెలుపుతూ.. ‘‘నా వ్యక్తిగత విషయాలు కొన్ని మీకు చెప్పే టైమ్ వచ్చింది.

గత మూడేళ్లుగా నేను ఎక్కడా పని చేయలేదు. నేను ఇండస్ట్రీకి దూరం కావడానికి ఓ కారణం ఉంది. ఇప్పుడు అది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నేను కోల్‌కతాకి చెందిన కొరియోగ్రాఫర్‌తో గత కొన్నేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నాను. అతనితో ప్రేమలో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నేను ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాను.ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. త్వరలోనే అతని పేరును బయటపెడతాను. నేను ఇక మౌనంగా ఉండను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం నైనా గంగూలీ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

Next Story