‘వదలా’మూవీ అద్భుతంగా వచ్చింది.. కచ్చితంగా మంచి హిట్ కొట్టగలమనే నమ్మకం ఉంది: జగపతి బాబు

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-11 15:04:31  IST  )

‘వదలా’ సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడం మీడియా బాధ్యత. తీసుకెళ్లకపోతే మిమ్మల్ని వదలా..

‘వదలా’మూవీ అద్భుతంగా వచ్చింది.. కచ్చితంగా మంచి హిట్ కొట్టగలమనే నమ్మకం ఉంది: జగపతి బాబు
X

దిశ, సినిమా: వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి. కృష్ణ దర్శకత్వంలో.. కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా, మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేసి అంచనాలను పెంచారు. ఇక ఈ ఈవెంట్ లో హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. వదలా సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడం మీడియా బాధ్యత. తీసుకెళ్లకపోతే మిమ్మల్ని వదలా.. ఆడియన్స్ రాకపోతే వాళ్లని వదలా.. బాగుంది అనేవరకు వదలా ఇది ఆడియన్స్‌కి మీకు మాకు.. మన ముగ్గురికి సంబంధించిన మేనియా. మా సినిమా అద్భుతంగా వచ్చింది.. కచ్చితంగా మంచి హిట్ కొట్టగలమనే నమ్మకం ఉందని అన్నారు. ‘వదలా’ తీసిన తర్వాత సినిమా అంటే గౌరవం పెరిగిందని పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత కిషోర్.

Next Story