- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూమెంట్ కోసం నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.. ప్రేమపై ఓపెన్ అయిన ప్రభాస్
నిజం చెప్పాలంటే నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఉంది.

దిశ, సినిమా: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పెళ్లి గురించి గత కొంత కాలంగా ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అనుష్క నుండి కృతి సనన్ వరకు ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా.. ప్రభాస్ మాత్రం ఎప్పుడూ తన నవ్వు తోనే సమాధానం దాటవేస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా ఆయన తన మనసులోని అసలు కోరికను బయటపెట్టి ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. రీసెంట్‌గా విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple friendly)సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, ఆ మూవీ టీమ్‌తో ప్రభాస్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇంటర్వ్యూలో హీరోయిన్ మానస వారణాసి చమత్కారంగా ‘ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి డార్లింగ్?’ అని అడిగేసరికి ప్రభాస్ కాసేపు సిగ్గుపడ్డారు.
‘ఇది నీ పర్సనల్ క్వశ్చన్ కదా’ అంటూనే, ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చారు. ‘‘నిజం చెప్పాలంటే నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఉంది. ఆ మూమెంట్ కోసం నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను ’’ అని ప్రభాస్ చెప్పారు. ఈ మాట వినగానే అటు ఇంటర్వ్యూ చేస్తున్న టీమ్, ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పటి వరకు పెళ్లి అంటే తప్పించుకునే ప్రభాస్, ఇప్పుడు ప్రేమించాలని ఉంది అని చెప్పడం వెనుక ఏదైనా బలమైన సంకేతం ఉందా అని చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 46 ఏళ్లు.
ఆయన వయసు హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయినా, ప్రభాస్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులను వేటాడటంలోనే బిజీగా ఉన్నారు. అయితే తాజా కామెంట్స్ చూస్తుంటే, డార్లింగ్ త్వరలోనే తన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది? ప్రభాస్ మనసు గెలుచుకునే ఆ రాణి ఎవరు? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. డార్లింగ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన భారీ లైనప్‌తో తీరిక లేకుండా గడుపుతున్నారు. సలార్-2, స్పిరిట్, ఫౌజీ, కల్కి-2 వంటి చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ చిన్న సినిమాలకు తనవంతు సపోర్ట్ ఇస్తున్నారు.






