- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన మీద ఉన్న నమ్మకంతో ‘కుబేర’ ఒప్పుకున్నాను.. నాదే మెయిన్ క్యారెక్టర్ అనుకుంటే చివరలో అలా జరిగింది: నాగార్జున
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలో నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘కుబేర’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలో నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు(Pushkar Rammohan Rao) నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. అయితే ‘కుబేర’ సినిమా జూన్ 20న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీసు వద్ద రాణిస్తోంది.
ఈక్రమంలోనే సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. ఇందులో ధనుష్, నాగార్జున ఇద్దరిలో ఎవరిది, మెయిన్ క్యారెక్టర్ అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ‘‘శేఖర్ కమ్ముల మీద నమ్మకంతో కథ చెప్పగానే ఓకే చేశాను. ఆయనలో సినిమా చేయాలని అనుకున్నాను. అతను తెరకెక్కించిన ప్రాజెక్ట్స్ చూశాను. క్యారెక్టన్‌ను చాలా లోతుగా చూపిస్తారు. కుబేర’ గురించి మొదట చెప్పినప్పుడు ఇందులో నాదే మెయిన్ రోల్ అనిపించింది.
అన్ని పాత్రలు నా పాత్ర దీపక్ చుట్టే తిరుగుతాయి కాబట్టి అలా అనుకున్నాను. సినిమా కథకు నా పాత్ర చేసే పనులే కీలకం. దీంతో ఈ చిత్రంలో నాదే మెయిన్ క్యారెక్టర్ అనుకుని మూవీ చేశాను.నా క్యారెక్టర్‌లో మూడు షేడ్స్ ఉంటాయి. అందుకే ఈ పాత్ర నచ్చి ఒప్పుకున్నా. ధనుష్‌కు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉన్నప్పటికీ అది నేను పట్టించుకోను. అయితే రిలీజ్ అయ్యాక నా ఫ్రెండ్స్, మీడియా, ఫ్యాన్స్ చెప్పే కామెంట్స్ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కింగ్ ఈజ్ కింగ్ అంటున్నారు. నాకు ఈ పాత్ర ఇచ్చిన శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






