నోరా ఫతేహి బూతు పాటపై హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్.. నిర్మాణ సంస్థకు నోటీసుల సెగ!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-17 08:21:14  IST  )

నోరా ఫతేహి వేసిన స్టెప్పులు, ధరించిన కాస్ట్యూమ్స్, సాహిత్యం అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

నోరా ఫతేహి బూతు పాటపై హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్.. నిర్మాణ సంస్థకు నోటీసుల సెగ!
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి నిత్యం వార్తల్లో నిలుస్తూ.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా పలు వివాదాల్లోనూ చిక్కుకుంటూ విమర్శలకు గురవుతోంది. తాజాగా, నోరా ఓ బూతు పాటలో చిందులేయడం సంచలనంగా మారింది. కన్నడ యాక్షన్ డ్రామా ‘కేడీ: ది డెవిల్’ చిత్రం విడుదల కాకముందే భారీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించిన ‘సర్సే నిన్న సెరగా సర్సే’ అనే ఐటమ్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ పాటలో నోరా ఫతేహి వేసిన స్టెప్పులు, ధరించిన కాస్ట్యూమ్స్, సాహిత్యం అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. వివాదం ఎంతలా ముదిరిందంటే, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా ఈ విషయంపై జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

తాజాగా, మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "కనీస నాగరికత ఉన్న ఏ వ్యక్తయినా ఈ పాటను తన కుటుంబంతో కలిసి చూడగలడా?" అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ పాటలోని విజువల్స్, సాహిత్యం సభ్యసమాజానికి విరుద్ధంగా ఉన్నాయని భావించిన కమిషన్, చిత్ర నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారాలా అని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పాట విడుదలైన 24 గంటల లోపే యూట్యూబ్ నుండి దానిని తొలగించి ప్రైవేట్ మోడ్‌లోకి మార్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో అందుబాటులో లేదు.

నా హార్ట్ బ్రేక్ చేసి ఆ అబ్బాయి వెళ్లిపోయాడు కానీ కర్మ వదిలిపెట్టదు.. బ్రేకప్‌పై రీతూ చౌదరి సంచలన పోస్ట్

Next Story